ఈ మధ్య ఓ మితృడన్నాడు... ఫుల్ సౌండ్ తో, వాద ప్రతివాదనల తో వేదికల పై గోల చేస్తున్న ప్రరాపాది నిశ్శబ్ద విప్లవం ఎలా అవుతుంది? ఆ పదం లోక్ సత్తా కి సరిపోతుందేమో అని. కొత్త నియోజకవర్గం కూకట్ పల్లిలో అతని విజయం ఖరారయినట్టే. అక్కడ విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాస్త ఎక్కువ. ముఖ్యం గా ప్రాంతీయాభిమానం, కులాభిమానం మరీ ఎక్కువ.
ఇక ఆయన ప్రచార శైలి చూస్తే ఒబామాని అనుకరించినట్టే ఉంది. పిల్లల భవిష్యత్తుకు హామీ, మార్పు వగైరా అంశాల నుంచి, వీడియో క్లిప్పుల్లో బ్యాక్ డ్రాప్, రైలు ప్రయాణం వంటివి బాగానే అనుకరించబడుతున్నాయి. గతంలో ఆయన సాధించిన స్కోరు చూస్తే నిశ్శబ్ద విప్లవం అనే మాట లోక్ సత్తాకి సరిపోతుందేమో!
20, మార్చి 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
మద్యం, డబ్బు, కులం, ప్రాంతీయాభిమానాలతో సంభంధం లేకుండా అయన గెలవాలి అని ఆశిద్దాం...
నిశ్శబ్ద విప్లవం అనే మాటను మేం ముందు వాడాం, దాన్నే కొన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. నినాదాల కోసం కూడా సొంతంగా ఆలోచించలేరు వాళ్ళు, అని అన్నాడు జేపీ ఈ మధ్య!
కామెంట్‌ను పోస్ట్ చేయండి