కానీ నెల రోజుల తర్వాత మొలకలు చూడాలని ఆశించింది! అడపా దడపా ఉద్యమాలు మినహా పార్టీని పరిపుష్టం చేయడానికి క్షేత్ర స్థాయిలో కసరత్తు నాలుగేళ్ళు శూన్యం. విత్తనాలు చూడబోతే పాతబడి నాసి రకంగా మారాయి. వాటికి నీరు పోసి, పదును లేని భూమిలో విత్తి, అనువైన వాతావరణం కోసం ప్రార్ధించి, నెలరోజుల తర్వాత ఫలితం చూడలనుకున్నారు పెద్దలు.
నేల సరి లేక పోయినా, విత్తనం వేసే ముందు నీళ్ళలో వేస్తే దాని పసేమిటో తెలిసిపోయేది. 2004 లో బొటాబొటీ మెజారిటీ వచ్చిన విత్తనాలు ఎప్పుడు చూసినా పార్టీ కార్యాలయాన్ని అంటి పెట్టుకుని ఉండేవి. లోలోపల ఉడికి పోయి పస లేకుండా తయారయిన వీటిని మొలకల కోసం వాడలనుకోవడం ఎంత అవివేకం. "నేల సంగతి సరే, విత్తనమయితే మన కళ్ళముందే నిగ నిగ లాడుతూ వుంది... కొద్దో గొప్పో వాతావరణం కూడా అనుకూలంగానే వుంది కదా" అనుకున్నారు.
ఇంకేం, 16వ తేదీన మొలకలన్నిటినీ జనాలకి చూపించి మెప్పిద్దామానుకున్నారు. కానీ ఈ స్పెషల్ గ్రేడ్ విత్తనాలు, సాధారణ వ్యవసాయక పరిస్థితుల్లో మొలకేత్తలేవు. వాటికి అసాధారణ అనుకూలత అవసరం. బోటనీ, థియరీ, రిపోర్టులు మొదలైన వాటిని వదలి, మన చేతిలో లేని వాతావరణ పరిస్థితుల కోసం ప్రార్థించే కన్నా, మన నేల సరి చేసుకుని, విత్తనాల్ని పరీక్షించుకోవడం తెలివైన పనేమో!
*చూసి రమ్మంటే కాల్చి వచ్చే కొడాలి నాని లాంటి యువ నేతల్ని వదిలి, కాల్చి రమ్మంటే చూట్టనికే వేరే వాళ్ళని పంపి, తర్వాత వాకబు చేసే సో కాల్డ్ సీనియర్ లీడర్లతో ఎంత వరకు ప్రయోజనం?
20, మే 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
తెలుగుదేశానికి పట్టిన చీడ, ఈ సీనియర్ నాయకులు. వాళ్లు గెలవలేరు, గెలిసేవాళ్లను పార్టీ లోకి రానీయరు.
చంద్రబాబు ఓటమికి,
1. తెలాంగాణా మీద తీసుకొన్న నిర్ణయం,
2. TRS పొత్తు
3. ఆంధ్రా లో, మాత్రం ఈ సీనియర్ నాయకులు కారణం.
4. చంద్రబాబు టికెట్ల విషయం లో, చూపిన నాంచివేత కూడా మరికొంత కారణం.
ఇప్పటికి అయినా, ఈ ముసలి (అలోచనలలో) నాయకులను ప్రక్కన పెట్టి, తను అనుకొన్న పని తాను చేయడం మంచిది. (ఉదాహరణకు, కోడెల, బలరాం లాంటి వాళ్లు, కావాల్సింది నాని, ఉమా లాంటి వాళ్లు)
ఏది ఎమైనా, ఈ ఎన్నికలలో 90+ సీట్లు గెలవటం మాత్రం అంత సులభమైన విషయం కాదు (70+ సీట్లు వదులుకొని ప్రొత్తులవలన, ప్రజరాజ్యానికి జరిగిన వలసలు, లోకసత్తా చీల్చిన అర్బన్ ఓట్లు చూస్తే)
నాకు తెలిసిన ఓ TDP పెద్దాయన results వచ్చాక TDP కి ఇంత బలం ఉంది అని నేను అనుకోలేదయ్యా అన్నాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
కాకపోతే ప్రస్తుతం ప్రతిపక్షం గా, TDP, PRP తో కలసి మరింత పోరాట పటిమ చూపాలి, raaja & co చేస్తున్న పాపపు పనులకు (భూములు లాక్కోవటం అయితేనేమిటి, గనుల లీజ్లు అయితేనేమి) కొదవలేదు కాబట్టి, పోరాడాలంటే పోరాడవచ్చు.
అంతకంటే ముందు, ప్రజలలో కోల్పోయిన credibility సంపాదించుకోవటం కూడా ముఖ్యం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి