ఫీలయ్యారా?

14, జనవరి 2009, బుధవారం

మొద్దు శీనుపై ఉన్న శ్రద్ధ మామూలు మనిషి పై లేదేమి?

"మానవ హక్కులు"అనే డొక్కు మాటను పలికే బదులు మన హక్కులు అని కాసేపు మాట్లాడుకుంటే సరిపోతుందేమో! చట్టాన్ని అమలుపరిచే వారు తమ భాద్యతలని విస్మరించినపుడో లేదా అత్యుత్సాహం ప్రదర్శించినపుడో మనవ హక్కులంటూ ఒకట్రెండు రోజులు హడావిడి చేసి డిసంబరు 10న ఉత్సవాలు చేసుకుంటూ వుంటారు. మంచిదే! కానీ వాళ్ల పోరాటం కొద్ది మంది కోసమే ఎందుకు పరితమవుతోంది? అధిక సంఖ్యలో ఉన్నసామాన్య ప్రజానీకం యొక్క హక్కుల పరిరక్షణ వారి దృష్టిలో ఎందుకు లేదు?

అందుకే కాసేపు మన హక్కుల గురించి మనమే ప్రశ్నిద్దాం. స్వచ్చమైన గాలి, భూగర్భ జలాలు మరియు వనరులు, రోజువారి పనుల కోసం పబ్లిక్ స్థలాల్లో తిరిగే స్వేచ్చ కూడా ఇప్పుడు సన్నగిల్లిపోతున్నాయి.

మొద్దు శీనుపై ఉన్న శ్రద్ధ పాపం హక్కుల సంఘాల వారికి మామూలు మనిషి పై లేదు. ఉన్నత స్థాయి సమావేశాలు, మేధావుల సదస్సులంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే వారి ఆసక్తికి మనం కారణం కాలేనపుడు, అంతర్గత భద్రత, కనీస హక్కుల కోసం మనమే ఒక యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడం ఇప్పుడు ఎంతైనా అవసరం.

ఈ ప్రయత్నంలో ఇప్పటికే పనిచేస్తున్న సంస్థలకు నావంతు సహకారన్నందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆలోచనాపరులు, ఆచరణశీలురందరూ తమ అభిప్రాయలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

mana daggara anni samsthaloo dadapu alage unnayi. routine ki bhinnam gaa edo cheyyalane tapana vaallaki ekkuva. swatantra bharatamlo kaneesa hakkulaki maanava haakulu chaala dooram brother!