ఫీలయ్యారా?

29, జనవరి 2009, గురువారం

పొలిటికల్ "పద్మ"లు: నాడు దర్శకరత్న, నేడు పుత్ర రత్న

సూపర్ స్టార్ కృష్ణ గారికి "పద్మభూషణ్" రావడానికి మేము కృషి చేశామని సుబ్బిరామి రెడ్డి గారంటున్నారు. అప్పట్లో మెగాస్టార్ కి అవార్డు రావడానికి దాసరి కూడా "కృషి" చేశారు. కాని ఇప్పుడు ఆ అవార్డు ఇవ్వడానికి ముఖ్య ప్రేరణ "పోకిరి" మహేష్ బాబు ఇమేజ్. ఓ పెద్ద వోటు బ్యాంకుని కొల్లగొట్టవచ్చన్న ఉద్దేశ్యంతోనే పద్మాలయ స్థల వివాదం ఆగమేఘాల మీద పరిష్కరించేశారు. ఘట్టమనేని కుటుంబాన్ని మంచి చేసుకోవడానికి ఇప్పుడు "పద్మభూషణ్" తాయిలాన్ని ప్రకటించారు. వీరికి ఎప్పుడోనే సదరు అవార్డులు పొందగలిగే అర్హతలు ఉండవచ్చు కానీ, వారు అవి పొందిన సందర్భం మాత్రం గమనార్హం.


ఒకళ్ళ ప్రయోజనాల కోసం మరొకరు సత్కరించుకోండి, సన్మానించుకోండి! కానీ మితిమీరిన ప్రమేయంతో జనాల జేబులకు చిల్లు పెట్టాలని ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుంది. 2005 లో చిరంజీవి సినిమా "జై చిరంజీవ" విడుదల సమయంలో "పద్మ" అవార్డుని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ రేటుని పెంచేశారు. తదనంతర పరిణామాలకి స్పందించి దాన్ని తగ్గించేశారు.


ఈ మధ్య అక్కినేని నాగార్జున కూడా రేటు పెంచడాన్ని సమర్ధించారు. ఇలాంటి తిక్క పనులతోనే పైరసీ రక్కసిని ఆహ్వానించుకుంటున్నారు. ఆయన కూడా ప్రస్తుత ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి. ( గత ఎన్నికల సమయంలో లోక్ సత్తా - ఇది మీ సత్తా అని ప్రచారం చేసిన వ్యక్తి).

కామెంట్‌లు లేవు: