అవసరానికి మించి సరఫరా ఉంటే వస్తువు విలువ తగ్గిపోతుంది. అది సహజం. నిలువ ఉండే కాలం కూడా తక్కువ గా ఉండడం వల్ల అసలు విలువే లేకుండా పోతే? పాలు, టమాట వంటి వాటికి అది వర్తిస్తుంది.
రాయల సీమలో ఒక టమాట బోర్డుని (డైరీ వలె) ఏర్పాటు చేసి దానిని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తే, కనీసం మార్కెట్ పోకడలైనా తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వ బోర్డు స్పందించే అవకాశం వుంటుంది.
ప్రస్తుత సరఫరా ఈవిధం గా వుంది: రైతు - కమీషన్ ఏజెంటు - హోల్ సేలర్ (ప్రధమ / ద్వితీయ) - చిల్లర వ్యాపారి - వినియోగదారుడు
బోర్డు ద్వారా రైతుని సత్వరం చిల్లర వ్యాపారికి లేదా పెద్ద వినియోగదారునికి అనుసంధానిచే వీలు దొరుకుతుంది. సరఫరా అధికంగా వున్నా పోటీ ధర లభిస్తుంది లేదా కనీస మద్దతు ధర లభించడానికి అది ఉపయోగపడుతుంది. జ్యూసులు, సాస్ తదితర నిల్వ మార్గాలని అన్వేషించి పెట్టినా అవి అమలు చేయడానికి సమయం పడుతుంది.
సాంకేతికతని, వ్యాపార సూత్రాలని అవసరాన్ని బట్టి అమలు చేయనంతవరకు శ్రమ, డబ్బు వృధా అవుతూనే ఉంటాయి.
2 కామెంట్‌లు:
ఇక్కడ మేం ఆరు నెలల క్రితం ఇటలీ లో ప్యాకింగు చేసిన టమోటా ముక్కల ని మహదానందంగా కొనుక్కుని కూరొండుకు తింటున్నాం.
లక్షల కోట్ల రూపాయలు (సొంత జేబుల్లోకి వెళ్ళే మార్గముంది కాబట్టే) ఖర్చు పెట్టటానికి సిద్దమవుతారు కాని, గ్రామీణ స్థాయి లో సరైన సాంకేతిక పరిఙ్ఞానం పరిచయం చేయటానికి ముందుకు రారు. ఎవరైనా వస్తే హైదరాబాదు నుంచే వెనక్కి తిప్పి పంపేస్తారు.
Good idea!
Hope the administrators/politicians have some 'TIME' to spare for the farmers instead of political gimmicks/FREE - promises.
కామెంట్‌ను పోస్ట్ చేయండి