దేశంలో నెలకో బాంబు ఇప్పుడు సహజం అయిపొయింది. అది జరగకపోతే వింత అన్నట్టుంది పరిస్థితి. ఇక భాగ్యనగరంలో ఇవాళో రేపో ఎక్కడో ఒక చోట ఉగ్రవాదులు పంజా విసురుతారని కొత్త సంవత్సరం ముందు నుంచి అనుకుంటున్నారు. ఒక పక్క సంక్రాంతి! పెద్ద పండుగ. ఎంత పెద్ద పండుగ అంటే పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊర్లకి తరలి వెళ్ళడం వల్ల నగరం దాదాపు ఖాళీ అయ్యేంత.
అందులో కృష్ణ, గోదావరి, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాలకి వెళ్లేవారు ఎక్కువ. వీరందరికీ బస్సు ప్రధాన రవాణా సదుపాయం. మన ఆర్టీసీ వాళ్లు స్పెషల్ బస్సులు కూడా వేశారాయే! ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బస్ స్టేషన్ లో భద్రత అత్యంత పేలవంగా వుంది. మన వాళ్ళకేమీ కాలేదు అన్నంత వరకు మనం ఇలా నిబ్బరంగానే తిరుగుతుంటాము. ఏదైనా జరిగితే సోనియా, మన్మోహన్ గార్లు పరామర్శించడానికి రానే వస్తారు.
12, జనవరి 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి